VIDEO: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసిన ఎమ్మెల్యే
అన్నమయ్య: మదనపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం పట్టణంలోని మార్పురి స్ట్రీట్‌లోని టీ స్టాల్ వద్ద అభిమానులతో కలిసి టీ తాగుతూ, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లి అభివృద్ధికి ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.