రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

అన్నమయ్య: కేవీపల్లె మండలంలోని నారమకుల మిట్ట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడుతో వెళ్తున్న ఆటో టైర్ పగిలి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మల్లికార్జున (40), ఎర్రం రెడ్డి (60), చెంచయ్య అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వారిని 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.