'సరదా.. ప్రాణాల మీదకు రావొద్దు'
BHNG: వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు కాలువలు, బావుల వద్ద ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి లోతు, ప్రవాహ వేగం తెలియకుండా నీటిలోకి దిగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు వెంటే ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని కోరారు.