'గో బ్యాక్ మార్వాడీ' ఉద్యమం బంద్‌కు పిలుపు

'గో బ్యాక్ మార్వాడీ' ఉద్యమం బంద్‌కు పిలుపు

MLG: 'గో బ్యాక్ మార్వాడీ' ఉద్యమం తీవ్రమవుతోంది. చేతివృత్తుల వారిని దెబ్బతీస్తున్న మార్వాడీ దుకాణాలను వ్యతిరేకిస్తూ జనగామ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వలబోజు చక్రపాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపునకు జనగామ విశ్వ బ్రాహ్మణ సంఘం, పట్టణ స్వర్ణకార సంఘం పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు.