VIDEO: నందికొట్కూరులో ఉచిత వైద్య శిబిరం
NDL: నందికొట్కూరు జమ్మి చెట్టు వద్ద మంగళవారం శ్రీశైలం భక్తుల కోసం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఉగాది పండుగ పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు కేరళ తైలంతో పాదాలకు మసాజ్‌ను నిర్వహించారు. ఈ నెల 14 వరకు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.