వారికి వర్కర్‌ వీసాలు మంజూరు చేయం: అమెరికా

వారికి వర్కర్‌ వీసాలు మంజూరు చేయం: అమెరికా

వీసాల అనుమతి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా తాజాగా మరో బాంబు పేల్చింది. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు ఇకపై వర్కర్ వీసాలను మంజూరు చేయమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.