నేడు ప్రారంభంకానున్న ప్రత్యేక అధికారుల పాలన

నేడు  ప్రారంభంకానున్న ప్రత్యేక అధికారుల పాలన

కడప: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.