ఉస్మానియా, గాంధీలో సెలవులు నిలిపివేత

HYD: భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పూర్తి యుద్ధానికి దారితీస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్యశాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు, సహాయక సిబ్బంది సెలవులను నిలిపేసింది. ట్రామా సేవలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2 దవాఖానాల్లో 3 నెలలకు సరిపడా అన్ని రకాల మందులు ఉన్నాయి.