మందు డబ్బుతో రైతు హల్చల్
HNK: శాయంపేట (M) కొప్పుల గ్రామ శివారులో భూమి కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వసంతపూర్ గ్రామానికి చెందిన రైతు చల్ల గోపాల్ రెడ్డి తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు డబ్బాతో మీడియా ముందు నిరసన తెలిపారు. ఏళ్ల క్రితం మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసినా, చల్ల అశోక్ రెడ్డి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.