అయ్యప్ప స్వామి దేవాలయానికి శంకుస్థాపన

కృష్ణా: పెనమలూరులో శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి శంకుస్థాపన పూజా కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి పనులను లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.