తెనాలిలో చలివేంద్రం ప్రారంభం
GNTR: తెనాలి పట్టణంలో 'శ్రీమతి మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవాసమితి' ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. డీఎస్పీ జనార్ధన్ రావు, వన్‌టౌన్ సీఐ, ట్రాఫిక్ ఎస్సైలు కలిసి ప్రారంభించారు. ఎండలలో తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.