రామలింగపురంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం రామలింగాపురం రైతు సేవ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ ఆద్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుకు వరిపంటలో సాగుకు పలు మెళుకువలపై అవగాహన కల్పించారు. నారుమడిలో పురుగులు మరియు తెగుళ్ళ నివారణకు క్లోరోపైరిపోస్ 2 మిల్లీమీటర్ల నీటిని కలిపి పిచికారి చేసి, ఎరువులు 2కిలోల యూరియా అందించాలన్నారు.