'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం'

'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం'

MBNR: జిల్లా కేంద్రంలోని వీరన్నపేట్‌లో సోమవారం అర్హులైన లబ్ధిదారులకు మూడవ విడతలో భాగంగా రేషన్ కార్డులు కాంగ్రెస్ నాయకులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వార్డ్ నెంబర్ 14 కాంగ్రెస్ నాయకులు రఘు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక అనేక సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారన్నారు. సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.