'పదవ తరగతి పరీక్షకు 7 మంది గైర్హాజరు'
సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 7 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 7317 మంది విద్యార్థులకు 7310 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.