పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
SRD: పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలను, మౌలిక వసతులను, విద్యార్థుల చదువుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని, పదో తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు.