అంగన్వాడీ వేతనాల పెంపుపై ధర్నా.!
NDL: డోన్‌లో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని, గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా CITU నేత టి.శివరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు.