భద్రాచలంలో అన్నదానానికి రూ. లక్ష విరాళం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అన్నదాన సేవకు భక్తుల విరాళాలు అందజేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాస్తవ్యులు సువాణం మారుతి శ్రీకాంత్ శర్మ స్వామివారి అన్నదాన నిమిత్తం లక్ష రూపాయలను భక్తి పూర్వకంగా విరాళంగా అందించారు. అనంతరం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.