కావేరీ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ
GDWL: కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు జమ్మిచెడు కార్తీక్ డిమాండ్ చేశారు. శుక్రవారం గద్వాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రైవేటు ట్రావెల్స్ మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రజల ప్రాణాలను హరించివేస్తున్నాయని మండిపడ్డారు.