నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

SRPT: తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని CPI జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిలుకూరు మండలం నారాయణపురంలో తుఫాను కారణంగా కూలిపోయిన ఇండ్లను, చెరువుకు పడిన గండిని పరిశీలించారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.