సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు: సీఐ

సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు: సీఐ

SRCL: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. చందుర్తి మండలం ముదపెల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.