గురుకుల కళాశాలను సందర్శించిన RCO

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను మంగళవారం రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ సుధాకర్ కళాశాలను సందర్శించారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు , అంజన్ కుమార్ పాల్గొన్నారు.