బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాళ్ళం
WGL: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నాళ్ళం సంపత్ కుమార్ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు ఇవాళ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. బీసీ సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని సంపత్ కుమార్ గౌడ్ తెలిపారు.