PVSN రాజు కుటుంబానికి నాగబాబు పరామర్శ

PVSN రాజు కుటుంబానికి నాగబాబు పరామర్శ

AKP: చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ PVSN రాజు కుటుంబాన్ని ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆదివారం పరామర్శించారు. విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో అస్వస్థతకు గురైన రాజు చికిత్స అనంతరం ఇంటికి చేరుకోవడంతో, ఆయన నివాసానికి వచ్చిన నాగబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజుతో పాటు ఆయన కుమారుడి ఆరోగ్యంపై కూడా వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు.