VIDEO: హెల్మెట్ వినియోగంపై ఎస్సై స్పెషల్ డ్రైవ్
NLR: రాపూరు మద్దెలమడుగు జాతీయ రహదారి వద్ద హెల్మెంట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులపై రాపూరు ఎస్సై రాజేష్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసి హెల్మెట్ కొనుగోలు చేసి ప్రయాణించేలా చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదం గురించి వివరించారు.