జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం ఎన్నిక

E.G: ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవం అయింది. జిల్లా అధ్యక్షుడిగా సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ దొర, కార్యదర్శిగా మోహన్ కుమార్, జాయింట్ సెక్రెటరీగా ఆకుల నరేష్ కుమార్, కోశాధికారిగా వి సుబ్రహ్మణ్యం, సలహాదారుగా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.