అనుమతి లేని ఇసుక లారీ పట్టివేత

KMM: ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర నుండి తెలంగాణకు రవాణా చేస్తున్న ఇసుక లారీని వైరా పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వైరా ఎస్ఐ పుష్పాల రామారావు కథనం ప్రకారం.. వాహనాలు తనిఖీల్లో భాగంగా ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఏపీ 27 టీజడ్ 2497 లారీని అదుపులోకి తీసుకోగా, ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.