జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

KRNL: భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్థుల దృష్ట్యా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు వెల్లడించారు.