తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేస్తే సహించం

తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేస్తే సహించం

BDK: కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. యాసంగి వరి ధాన్యం విక్రయాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అంకిత్ వ్యవసాయ అధికారులను నిన్న ఆదేశించారు. ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఆ దిశగా వారిని సన్నద్ధం చేయాలని సూచించారు.