VIDEO: 'కొత్త బిల్లు.. గ్రామీణ కార్మికుల హక్కులపై దాడి'
GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త బిల్లు గ్రామీణ కార్మికుల హక్కులను హరిస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను రక్షించాలని, ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో బిల్లును వ్యతిరేకిస్తూ.. బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.