ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

TPT: నాగలాపురం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలలో సోమవారం సాయంత్రం మండల వ్యవసాయ అధికారి చిట్టిబాబు, ఎస్సై సునీల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాలలో ఉన్న స్టాకు వివరాలు దుకాణాదారును అడిగి తెలుసుకున్నారు. స్టాకు రిజిస్టర్లను తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులను విక్రయించరాదన్నారు. రైతులకు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు.