సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న మంత్రులు

సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న మంత్రులు

AP: సత్యసాయి శతజయంత్యుత్సవాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు పుట్టపర్తిలో పర్యటించారు. ఈ క్రమంలో సత్యసాయి సమాధిని మంత్రులు అనగాని, పయ్యావుల, ఆనం, సత్యకుమార్‌ దర్శించుకున్నారు. జయంత్యుత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని వెల్లడించారు. ఈనెల 13 నుంచి 23 వరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.