డొంక రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డొంక రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

GNTR: నగరంలోని డొంక రోడ్డు మూడొంతెనల మార్గంలో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఒక గూడ్స్ ఆటో ఒరిగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.