ఆవులు, దూడలకు టీకాలు

ఆవులు, దూడలకు టీకాలు

AKP: ఆవులు దూడలకు లాంపీ స్కిన్ డిసీజ్ రాకుండా బుధవారం పరవాడ మండలం నాయుడుపాలెం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆవులు దూడల చర్మంపై పుండ్లు పడి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. 80 పశువులకు టీకాలు వేసామన్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.