కలెక్టరేట్‌లో అనధికారిక పార్కింగ్‌పై నిషేధం
JN: కలెక్టరేట్ సెల్లార్‌లో అనధికారిక వాహనాల పార్కింగ్‌ను నిషేధించినట్లు కార్యాలయ సూపరింటెండెంట్ రజిత తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు గురువారం తనిఖీలు నిర్వహించి,నిబంధనలకు విరుద్ధంగా నిలిపిన వాహనాలను గుర్తించారు. పార్కింగ్ స్థలం కేవలం కార్యాలయ అధికారులకు మాత్రమేనని స్పష్టం చేశారు.