'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి'

'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి'

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణు, డీసీపీ కరుణాకర్‌తో కలిసి జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందిచే మాదక ద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.