అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవహారం

KMM: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలు మావోయిస్టులపై హత్యాకాండ చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కర్రెగుట్ట ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.