నేడు చాగల్లులో టార్గెట్ బాల్ పోటీలు

నేడు చాగల్లులో టార్గెట్ బాల్ పోటీలు

E.G: చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును పాఠశాల ప్రాంగణంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు. కావున ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు శనివారం ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.