రంజాన్.. కలర్‌ఫుల్‌గా చార్మినార్..!
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా పాతబస్తీ విద్యుత్ దీపాలతో కళకళలాడింది. ఈ నేపథ్యంలో పండుగ ముందు రోజు ముస్లింలు పెద్ద సంఖ్యలో షాపింగ్ చేశారు. దీంతో చార్మినార్ పరిసరాలు ఎంతో కనువిందుగా, పండుగ వాతావరణంతో కనిపించాయి.