ఇళ్ల నిర్మాణాల్లో ఆలస్యం వద్దు: కలెక్టర్
బాపట్లలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ MGNREGS, గృహ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో వెనుకబడిన మండలాల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. PMAY ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని, పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.