గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

NLR: మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాలను ఎంఈవో-2 తోట శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. గండిపాలెం జడ్పీ, బాలుర గురుకుల పాఠశాలలను సందర్శించి, జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో ప్రస్తుతం పరిస్థితులు, అవసరమైన సౌకర్యాలను గుర్తించారు. విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఆయన సూచించారు.