'చేతికొచ్చిన పంటలు నష్టపోతాం'

MDK: 15 రోజులుగా యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపూర్‌లో కొందరు రైతులు మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో వరి పంటకు యూరియా అవసరమని, ఈ సమయంలో యూరియా లభించకపోవడంతో తాము పంట నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.