చేర్యాలలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు

చేర్యాలలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా జనగాంలోని చేర్యాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కురమ సంఘం నాయకులు, నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీ నాయకులు, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పోరాట స్ఫూర్తి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.