వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: యనమలకుదురు సంజీవ్ నగర్, కొత్త పంచాయతీ కార్యాలయం వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి గ్రామంలో రహదారులు, మంచినీటి సదుపాయం, సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.