బియ్యం స్వాహా.. రైస్ మిల్లు యాజమాని అరెస్ట్

బియ్యం స్వాహా.. రైస్ మిల్లు యాజమాని అరెస్ట్

PDPL: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 12.37 కోట్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న శ్రీ లక్ష్మీ ప్రసన్న  రైస్ మిల్లు యాజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిల్లు యాజమానులు వరప్రసాద్ రావు, శ్రీనివాస్‌ 2023-24 సంవత్సరానికి చెందిన సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి చెల్లించకుండా తిరుగుతున్నారు. దీంతో ఏ1గా ఉన్న వరప్రసాద్‌ను నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.