అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

BDK: భద్రాచలం గోదావరి నది నీటిమట్టం పెరిగిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అన్ని వేళల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి తెలిపారు.