లోక్ అదాలత్‌లో 450 కేసులు పరిష్కారం
ELR: చింతలపూడిలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 450 కేసులు పరిష్కారమైనట్లు జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి రూ. 81,440తో పాటు ఇతర కేసుల రికవరీ కలిపి మొత్తం రూ.50,36,496 అపరాధ రుసుము వసూలైందని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల సమయం, ధనం ఆదా అవుతాయని సూచించారు.