ట్రాక్టర్‌లో వెళ్లి టన్నెల్‌ను పరిశీలించిన మంత్రి

ట్రాక్టర్‌లో వెళ్లి టన్నెల్‌ను పరిశీలించిన మంత్రి

ATP: తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్‌ఎల్‌సీ కాలువ అండర్ టన్నెల్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మంగళవారం సందర్శించారు. వీరిద్దరూ స్వయంగా ట్రాక్టర్‌లో ప్రయాణించి టన్నెల్ లోపలికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ సాంకేతిక అంశాలు, భద్రతా ప్రమాణాలపై ఇంజినీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.