VIDEO: అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
WGL: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి MLA యశస్విని రెడ్డి సూచించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో WGL, JNG జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో MLA బుధవారం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.