గిద్దలూరులో ప్రజా దర్బార్
ప్రకాశం: గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్భార్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు. నివాస స్థలాలు, పక్కా గృహాలు దివ్యాంగ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, గ్రామాల్లోని సమస్యల పై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామన్నారు.