VIDEO: ఆపరేషన్ ఫెయిల్.. నిండు గర్బిణీ మృతి
అన్నమయ్య: మదనపల్లిలోని ఓ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి రెండో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా, సర్జరీ సమయంలో ఊపిరాడక మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.